ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య ముఖ్య ఉద్దేశం
ఆంద్రప్రదేశ్ లో ఉన్న బ్రాహ్మణ పురోహిత సభ్యులందరిని ఏకంచేసి వారి అభివృద్ది కోసం నిరంతరం కృషి చేస్తూ పురహితవు కోరే పురోహితునిగా అండగా నిలబడాలన్నదే సమాఖ్య ముఖ్య ఉద్దేశ్యం.
పురోహితం బ్రాహ్మణకుల వృత్తిగా ప్రభుత్వం గుర్తించి వారిని సామాజికంగా,ఆర్ధికంగా,రాజకీయంగా,అన్నివిధాలా ప్రభుత్వం చే యూతనివ్వలని “ సర్వేజనాః శుఖినోభవంతు “ అంటూ నిరంతరం లోకకళ్యాణం కోసం పాటుపడే పురోహితుల కుటుంబాలకు ఆర్ధిక భరోసా కల్పిస్తూ వారి సంక్షేమం కోసం నిర్వరామంగా పోరాడుతూ వారికి వెన్నుదన్నుగా సమాఖ్య నిలబడుతుంది.
అఖిల భారత పురోహిత బ్రాహ్మణ సమాఖ్య ఉచిత సభ్యత్వ , గుర్తింపు కార్డు నమోదు నియమనిబంధనలు.
పురోహితుని రిజిన్ ఫారంను ఇంగ్లీషులో మాత్రమే నింపాలి.
పురోహితుడు బ్రాహ్మణ వర్ణమునకు చెందిన వాడై ఉండవలెను.
గ్రామ పురోహితులు,పౌరోహిత్యం పై ఆదారపడి జీవనం సాగించే పురోహితులు అర్హులు.
ఇది ఒక గుర్తింపు పొందిన సమాఖ్య చే జారి చేయబడిన పురోహిత గుర్తింపు కార్డు దీనిని దుర్వినియోగ పరచిన కార్డు రద్దు చేసే అధికారం సమాఖ్య కు కలదు.
సమాఖ్య చే జారీ చేయబడిన ఉచిత గుర్తింపు కార్డు ఎటువంటి ప్రభుత్వ పధకాలకు వర్తించదు.